చవితి రోజు చంద్రుడ్ని చూస్తే ఏ పరిహారం చేయాలి.?
చవితి రోజు చంద్రుడ్ని చూస్తే ఏ పరిహారం చేయాలి.?
పూజ, నైవేద్యం ప్రత్యేకతలు ఇలా ఉంటే..వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారు. పొరపాటున చూస్తే చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుందంటారు. వినాయక చవితి రోజు ముందుగా పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత ప్రతిష్టించిన విగ్రహానికి పూజ పూర్తిచేస్తారు. పూజంతా అయిన తర్వాత కథ చదువుకుని అక్షింతలు భగవంతుడిపై వేసి అవే అక్షింతలు తీసుకుని తలపై వేసుకుంటారు. ఇలా చేస్తే నిందలు పడాల్సిన అవసరం లేదని..చవితి రోజు చంద్రుడిని చూసినా పర్వాలేదని చెబుతారు.వినాయకుడు జ్ఞానస్వరూపం, అగ్రపూజ్యనీయుడు. ఈ విషయం మరిచిపోయిన చంద్రుడు.. గణనాథుడి వింతరూపాన్ని చూసి, కిందకు వంగి తల్లిదండ్రులకు నమస్కరించలేకపోవడం చూసి నవ్వుతాడు. అది చూసి పార్వతీదేవికి కోపం వస్తుంది. ఇకపై చవితి రోజు చంద్రుడ్ని చూసినవారికి నీలాపనిందలు తప్పవనే శాపం ఇచ్చింది. అయితే వినాయక చవితి రోజు కథ చెప్పి అక్షింతలు తలపై వేసుకునేవారు చంద్రుడిని చూసినా ఎలాంటి దోషం ఉండదని అనుగ్రహించింది పార్వతీ దేవి.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి