"దానం చేయడం.
"దానం చేయడం..."
మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి.. “దానం చేయడం...!”
అందులో సందేహం లేదు.. అయితే ఇక్కడొక జాగ్రత్త అవసరం.
దానం పొందిన వ్యక్తి...పొందిన దానంతో తాను అభివృద్ధి చెందాలి, తిరిగి సమాజానికి ఉపయోగపడాలి.
దానం చేయడం వలన..., దానం పొందిన వ్యక్తితో పాటు దానం చేసిన వ్యక్తి కూడా ఆనందపడాలి.
అయితే కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారి సమాజాభివృద్ధికి ఆటంకమవుతారు, దీనితో పాటు చెడు వ్యసనాలకు బానిసలై మోసపూరిత మాటలతో దాతలను మరింత పీడిస్తారు.
దానం చేసే వ్యక్తి ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే... తన దానాన్ని స్వీకరించే వారు తగిన అర్హతలున్న వారా.. కాదా.. అని బాగా ఆలోచించాలి, తదుపరి ఖచ్చితంగా ఋజువు చేసుకోవాలి.
వారు దానం స్వీకరించడానికి అర్హులు అయితే.. అలాంటి వారికి మాత్రమే దానం ఇవ్వాలి. అది కచ్చితంగా సమాజ శ్రేయస్సుకొరకై ఖర్చు పెడితే సమాజం నుంచి నీకు ముంచి ఫలితాలు వస్తాయి. దైవం కొరకై ఖర్చు పెడితే దైవం నుండి అనుగ్రహం లభిస్తుంది.
దానం స్వీకరించే వ్యక్తులు.. తగినంత అర్హులు కారని తెలిసి కూడా... అలాంటి వారికి దానం ఇచ్చినట్టయితే.... అలాంటి దానాన్ని "అపాత్రదానం" అంటారు. ఈ అపాత్రదానం చేసే దాతలకు కలిగే అశుభ ఫలితాలు. పాప కార్యాలకు ఆ ధనం ఖర్చు చేస్తే ఆ పాపాలు పంచుకోవలసి ఉంటుంది. కష్టాలు ఎన్నో రకాలుగా అనుభవించవలసి ఉంటుంది.
దానం తీసుకున్న వారు, దానం ఇచ్చిన వారికి, చాలా ఋణపడి ఉంటారు. మరుజన్మలో వారి ఇంటిలో పనివారుగా ఉంటారు అని, శాస్త్రవచనం.
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి