నిజాయితీకి మరోపేరు!



నిజాయితీకి మరోపేరు! 

చీకటిపడే సమయం అవుతోంది. ఇక త్వరగా ఇల్లు చేరుకోవాలని త్వరత్వరగా నడుస్తున్నాడు అబ్రహాం లింకన్.

ఒక వీధి మలుపు దగ్గర ఒక పేద మహిళ…  'బాబూ కొంచెం సహాయం చేయండి ఆకలితో వున్నాను'  అని  అడిగితే తన జేబులోని రెండు నాణాలలో ఒకదాన్ని ఇచ్చాడు. 

ఆమె సంతోషించడం చూసి తృప్తిగా ముందుకు కదిలాడు.

నాలుగు కిలోమీటర్లు నడిచాక ఇల్లు వచ్చింది. దీపపు వెలుతురులో చూస్తే తన పొరపాటు తెలిసింది. 

ఎందుకంటే మధ్యాహ్నమే చూసుకొన్నాడు అందులో ఒక నాణెం చెల్లనిది. 

సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఆ విషయం మరచి చెల్లని నాణాన్ని ముసలి భిక్షగత్తెకు ఇచ్చాడు.

ఎంత పొరపాటు చేశాను! అనుకొని ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళి మంచి నాణాన్ని ఇచ్చి,    క్షమాపణ చెప్పి, చెల్లని నాణాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకొన్నాడు. 

ఇంతలో మబ్బులు కమ్మి , వర్షం పడే సూచనలు కనిపించాయి.

అయినా లింకన్ బయలుదేరాడు. వర్షం కురిసి తాను తడవకుండా వుండాలని ఆయన కోరుకోలేదు , వర్షం పడేలాగా వుంది అని ‘ఆ ముసలి భిక్షగత్తె  అక్కడి నుండి వేరేచోటికి వెళ్ళకుండా అక్కడే దగ్గర్లో వుండేలాగా చేయి దేవుడా!’ అని మనసులో అనుకొంటూ ,ఆ ప్రతికూల వాతావరణంలో వేగంగా నడుస్తూ , లింకన్ మళ్ళీ నాలుగు కిలోమీటర్లు నడచి ఆ ముసలి భిక్షగత్తె వున్న చోటుకు వెళ్ళాడు. 

ఆమె దగ్గర్లో మూసి వున్న ఒక దుకాణపు మెట్లమీద కూర్చుని కనిపించింది.

వెంటనే ఆమె దగ్గరికెళ్ళి క్షమాపణ చెప్పి చెల్లని నాణెం తీసుకొని మంచి నాణాన్ని ఇచ్చాడు.

”అయ్యో , మంచి నాణెం ఇవ్వడానికి మళ్ళీ వచ్చావా ? మరొకరు ఎవరైనా వచ్చి మరో నాణెం ఇస్తారు కదా!”  అని ఆమె అంటే , “రావొచ్చు , కానీ అపరాధం చేశానే  అనే నా మనసుకు కలిగిన బాధను తొలగించేందుకు ఎవరు వస్తారు ?” అంటూ అక్కడి నుండి మళ్ళీ నాలుగు కిలోమీటర్ల దూరం దాటడానికి బయలుదేరాడు లింకన్.

”మహాపురుషుడైన వ్యక్తి తన అంతరాత్మకు చీకటిలో కూడా జవాబుదారిగా వుంటాడు."

.రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...