కల్పవృక్షం వంటి 'శ్రీ గురుచరిత్ర'
ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ' నన్ను వశం చేసుకోడానికి ఈ ఎర్రని తోరం ధరించావా యేమి?' అని అడిగారు అది అనంత తోరమని, దాని మహిమ వలనే తమకు సిరిసంపదలు వచ్చాయు ఆమె చెప్పినా నమ్మక. అతడు దానిని త్రెంచి నిప్పులో పడేసాడు. కొద్దికాలంలొ వారింట దొంగలు పడి సర్వమూ దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తనతప్పిదము గుర్తించి, ఎలాగైనా అనంతుని దర్శించి, ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి, అనంతా! అనంతా! అని కేకలు వేసూ ఒక అడవిలో వెదకసాగాడు. దారిలో ఒక చోట పూత, కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని, దాని మీద ఒక్క పక్షేనా వాలలేదు. కౌండిన్యుడు, 'అనంతుడు ఎక్కడ?' అని అడుగగా, ఆ చెట్టు, నాకే ఆయన దర్శనం లభించలేదు!' అని చెప్పి, 'నీకు కన్పిస్తే, నాదుస్థితి గురించి ఆయనకు నివేదించు' అని చెప్పింది. ఆ ముని మరొకచోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును, దూడను చూచి, వాటిని అడిగాడు. అవి గూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కన్పించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్లాక కౌండిన్యునికి రెండు కొలనులు కన్పించాయి. ఒకదానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర యెక్కడా ఒక్క కొంగైనా వాలడంలేదు. అవి గూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద, ఒక ఏనుగు కన్పించి, అనంతుడు తమకెక్కడా కన్పించలేదన్నాయి.
చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చేయిపట్టి లేవదీసి, 'అనంతుని చూపిస్తాను రమ్మని, ఒక అందమైన పట్టణంలోని రాజ భవనంలో సింహసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు. కౌండిన్యుడు, అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి, నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి నాల్గు పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసమూ వరంగా ప్రసాదించాడు.
అప్పుడు కౌండిన్యుడు, తాను అడవిలో చూచిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా చెప్పాడు: 'పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై గూడా ఎవరికీ విద్య నేర్చకుండా, తన కాలమంతా శాస్త్ర వాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టె అడవిపాలయ్యాడు.
చవిటినేలను దానమిచ్చినవాడు మరు జన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై గూడ కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కచెల్లెళ్ళే నీవు చూచిన ఆ రెండు చెరువులు. క్రోధము వహించినవాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగానూ జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్దు డయ్యావు గనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చా త్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెల్పమని నిన్ను కోరినాయి గనుకనే, వాటన్నింటికీ ముక్తి కల్గింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు' అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటినుంచి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు”.
శ్రీకృష్ణుడు చెప్పిన యీ కథ విని, పాండవులు అనంత వ్రతం ఆచరించి, అనంతుని కృపవలన యుద్ధంలో శత్రువులను ఓడించి, మరలా రాజ్యం సంపా దించుకోగల్గారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందనివారే లేరు. కనుక సాయందేవా! నీవు గూడా నీ గోత్ర ఋషియైన కౌండిన్యునివలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు, అతని సంతతివారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి, శ్రీగురుని పూజించి, అచ్చటి బ్రాహ్మణులకు, సన్యాసులకు సంతర్పణ చేసారు. తర్వాత అతడు తన భార్యాబిడ్డలను యింటివద్ద దించివచి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనా ఊ కల్పవృక్షం వంటి 'శ్రీ గురుచరిత్ర' లభించింది. అతడి వంశంలో జన్మించినందుక నీవెంతో ధన్యుడవు”.
ASTRO HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#astrohavanijaa #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి