కుజుడు-గ్రహ సంయోగం


 

కుజుడు-గ్రహ సంయోగం

కుజుడు ఏయే గ్రహాలతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి.కాలపురుష చక్రంలో కుజుడు మేష లగ్నానికి అధిపతి మరియు అష్టమ భావం అయిన వృశ్చిక లగ్నానికి కూడా అధిపతి. మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాలకు కుజుడు అధిపతి. ఏ జాతకంలో అయినా కుజుడు బలహీన పడితే రక్తానికి ఎముకలకు, దంతాలకు,సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జాతకంలో కుజుడు బలహీనపడితే భూమి, గృహము,ఆస్తులు,సోదర సోదరీమణులతో సఖ్యత బలహీన పడతాయి. ఒక జాతకంలో కుజుడు బలంగా ఉంటే అనగా స్వక్షేత్రము,ఉఛ్ఛ

స్థానము కేంద్ర ,త్రికోణాలలో స్థితి పొందడం లేదా శుభగ్రహాలతో కలిసి ఉండడం జరిగినప్పుడు కుజుడు రాజయోగాన్ని ఇస్తారు.అనగా భూమి, గృహము,అభివృద్ధి,అధికారము ఉంటాయి.కుజుడు పదవ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయ అధికారము, పదవి పలుకుబడి ఇస్తారు.ఈ కుజ భగవానుడు రవితో కలిసి ఉన్నప్పుడు ఆత్మాభిమానము ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఇదే కుజుడు చంద్రుడితో కలిసినప్పుడు చంద్రమంగళ యోగం అంటారు వీరికి భూమి,గృహము ఉన్నత స్థాయిలో ఉంటాయి వీళ్ళు ఎల్లప్పుడూ భూములు కొనాలి,వ్యవసాయం చేయాలి లేదా వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వ్యాపారం చేయాలని కోరికతో ఉంటారు. కుజ భగవానుడితో బుధుడు కలిసినప్పుడు ఈ జాతకులు మ్యాథమెటిక్స్ లో ఎక్స్పర్ట్ గా ఉంటారు. మల్టీ టాలెంటెడ్ పీపుల్ గా ఉంటారు. భూములు వ్యాపారము భవన నిర్మాణం రియల్ ఎస్టేట్ రంగాలలో ఆసక్తి చూపిస్తారు.కుజ భగవానుడు గురుడుతో కలిసినప్పుడు గురు మంగళ యోగం అంటారు. వీరు ఎల్లప్పుడూ జిమ్ కి వెళ్లడానికి క్రీడల పట్ల ఆసక్తి,క్రీడలలో గెలుపు పొందుతూ ఉంటారు. ప్రభుత్వ సంస్థలతో సంబంధాలు రాజకీయ నాయకులతో సంబంధాలు అధికారము పదవి సమాజంలో గౌరవం ఏర్పడతాయి. ఈ కలయిక స్త్రీలలో ఉన్నప్పుడు దీర్ఘ సుమంగళీగా ఉంటారు. ఈ కుజ భగవానుడు శుక్రుడుతో కలిసినప్పుడు బృగు మంగళ యోగం అంటారు. దీనివలన భూమి వాహనము ఆస్తులు పెంపొందించుకుంటారు. కుజుడితో శని భగవానుడు కలయిక అంత మంచిది కాదు. ఈ కలయిక ఉన్న వారి జాతకంలో విశ్వాసం ఉన్న పనివాళ్ళు లభించరు. తరచుగా యాక్సిడెంట్లు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వివాహ జీవితంలో సమస్యలు, వివాహాలు ఆలస్యం కావడం, రెండు వివాహాలు, దంత సమస్యలు,ఎవరో ఒకరితో గొడవలు పడుతుండడం జరుగుతూ ఉంటాయి. కుజ భగవానులతో రాహు లేదా కేతువుతో కలిసినప్పుడు వైద్య వృత్తిలో ఉన్నవారు బాగా రాణిస్తారు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ సిబిసిఐడి ఇటువంటి వృత్తులు లో ఉన్నవాళ్లు మంచి అభివృద్ధి పథంలో ఉంటారు. ఈ వృత్తులు తప్ప వేరే వృత్తులలో ఉన్న వారైతే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఆడవాళ్ళ జాతకంలో కుజుడుతో రాహువు కానీ కేతువు కానీ కలయిక ఉన్నప్పుడు వివాహ విషయంలో సమస్యలు వివాహ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కుజ భగవానుడు ఇతర గ్రహాలతో సంయోగం చెందినప్పుడు వాటి యొక్క స్థితి యుతి వీక్షణ ఆధారంగా ఫలితాలు ఉంటాయి. 

జాతక ముహూర్త వివరాలకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

మాఘ పురాణం - 4 వ అధ్యాయము