అద్భుత వ్యాపార వృద్ధిని ప్రసాదించే గోమతి చక్ర ప్రయోగం......


 
అద్భుత వ్యాపార వృద్ధిని ప్రసాదించే గోమతి చక్ర ప్రయోగం............!!

 మీ ప్రస్తుత వ్యాపారంలో లేదా మీరు ప్రారంభించబోయే కొత్త వ్యాపారంలో అద్భుత విజయాన్ని పొందడానికి ఈ తంత్ర పరిహారం చేయవచ్చు. ఈ తంత్ర ప్రయోగం మీ వ్యాపారాన్ని అత్యంత లాభదాయకంగా, విజయవంతంగా, సంపన్నంగా చేస్తుంది.   గోమతి చక్రం చాలా శక్తివంతమైన, సులభంగా లభించే ఒక గొప్ప తంత్ర వస్తువు.  గోమతి చక్రం డబ్బును ఆకర్షించడానికి, ఆర్ధిక శ్రేయస్సు ను పొందడానికి మరియు సవాలు చేసే కష్టమైన పనులలో విజయం సాధించడానికి మరియు ఇతర అనేక తంత్ర పరిహారాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. గోమతి చక్రం శ్రీ మహా లక్ష్మి దేవి మరియు శ్రీ మహా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.  గోమతి చక్రం దానిని ఆరాధించే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, అదృష్టం, సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది.  ఈ తంత్ర ప్రయోగం చేయడానికి మీరు 11 గోమతి చక్రాలు, ఒక కొబ్బరి కాయ మరియు ఒక ఎరుపు రంగు పత్తి వస్త్రం సమకూర్చుకోవాలి.అన్ని వస్తువులను సమకూర్చుకున్న తరువాత మీరు ఒక శుభ తిథి వున్న శుక్రవారం నాడు తెల్లవారి సూర్యోదయ సమయంలో, తల స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, గోమతి చక్రాలను మొదట పాలతో, తరువాత నీటితో కడగాలి.  కడిగిన తరువాత శుభ్రంగా తుడిచి ఎరుపు రంగు కొత్త పత్తి వస్త్రం పైన ఉంచాలి. మీరు కొబ్బరిని కాయను కూడా గోమతి చక్రాలతో పాటు ఎరుపు రంగు పత్తి వస్త్రం పై ఉంచాలి. మీరు ఈ వస్తువులన్నింటినీ మీ ముందు ఒక చెక్క పీట మీద పెట్టుకోవాలి.   ఈ వస్తువులు అన్నింటిని మీరు మీ పూజ మందిరం లో కానీ లేదా ఒక శుభ్రమైన ప్రదేశంలో కానీ పెట్టుకోవాలి.  ఈ వస్తువులకు మీరు ఏ విధమైన పూజ చేయాల్సిన అవసరం లేదు. పూలు కానీ, దీప ధూప నైవేద్యాలు కానీ సమర్పించాల్సిన అవసరం లేదు.   ఈ వస్తువులన్నింటినీ మీ ముందు పెట్టుకున్న తరువాత, మీరు ఈ క్రింది మంత్రాన్ని 11 మాలలు అంటే 1188 సార్లు జపించి ఈ వస్తువులను శక్తివంతం చేయాలి. (11 మాలలు జపించాలి అంటే11 x 108 = 1188 సార్లు జపించాలి అని అర్ధం).

మంత్రం: " ఐం క్లీం శ్రీం "

మంత్రం చాలా చిన్నది కావడం చేత, గరిష్టంగా ఒకటి లేదా రెండు గంటలలో మీరు 11 మాలల మంత్ర జపాన్ని పూర్తి చేయవచ్చు. మీరు మంత్ర జపాన్ని లెక్కించడం కోసం 108 పూసలు కలిగిన రుద్రాక్ష మాలాను ఉపయోగించవచ్చు. మీరు 11 మాలలు అంటే 11 x 108 = 1188 సార్లు మంత్రాన్ని జపించాలి.   పై మంత్రంలో " ఐం " అన్నది శుభాన్ని, భాగ్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే సరస్వతీ బీజం.  " క్లీం " అన్నది బలమైన వశీకరణ శక్తిని, ఆకర్షణ శక్తిని ప్రయోగించే మన్మధ బీజం.  " క్లీం " బీజం గొప్ప వ్యాపార విజయానికి మంచి ఆకర్షణ శక్తిని మీ వ్యాపారాలకు ఇస్తుంది.  " శ్రీం " అన్నది లక్ష్మీ బీజం.  ఈ బీజం ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదలను ఆకర్షించి మీ వ్యాపారానికి గొప్ప ఆర్ధిక శ్రేయస్సు ని ఇస్తుంది.  1188 సార్లు మంత్ర జపం చేసి ఎరుపు రంగు వస్త్రంలో ఉంచిన అన్ని వస్తువులను శక్తివంతం చేసిన తరువాత, మీరు అన్ని వస్తువులను ఎరుపు రంగు వస్త్రం లోపలే ఉంచి, వస్త్రాన్ని బాగా చుట్టి, ఒక ఎరుపు రంగు దారం తో గట్టిగా మూట కాట్టాలి.   ఈ మూటను మీ కార్యాలయం, దుకాణం లేదా వ్యాపార ప్రాంగణం యొక్క ప్రధాన ద్వారం బైట పక్క, ముందు వైపున, ఎగువ భాగంలో కట్టి వేలాడదీయాలి.  శక్తివంతం చేయబడిన ఈ తాంత్రిక వస్తువులు  మీ వ్యాపారానికి ఎక్కువ మంది వినియోగదారులను, కస్టమర్లను, క్లయింట్లను ఆకర్షిస్తుంది.  మీ వ్యాపారానికి గొప్ప అదృష్టాన్ని, శుభాన్ని, వ్యాపార వృద్ధిని ప్రసాదిస్తుంది.  మంచి ధనాకర్షణతో మీ వ్యాపారానికి అద్భుత ఆర్ధిక శ్రేయస్సును అందిస్తుంది.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...