శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం

 శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం...............!!

ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో 

తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు...

పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ 

అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు .

శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో ,

భోగభాగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా తులతూగుతుండేవారు . 

అలా ఉన్నాకూడా! రాజు గజపతివర్మ తన మంత్రి శూరసేనుడుతో కలసి మారువేషంలో రాజ్యంలోతిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు 

ఆ రాజ్యంలో అందరు ధనికులే అయినప్పటికీ 

శాంతశీల అనే పేదరాలు ఉండేది. 

ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి. 

ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై 

దాడి చేస్తారు 

రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు.

అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి 

తన వంతు సాయం చేస్తాడు . 

దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి..

నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో'' 

అని అంటాడు .

కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే 

కాపాడానే గాని ఏదో ఆశించి మాత్రం కాదు'' 

అని వీరోచితంగా అంటాడు . 

దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని ''చెప్పి వెళ్ళిపోతాడు .ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది .

అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టేలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు అప్పుడు తను తన పేదరికం గురించి చెప్పినపుడు .

ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను . 

లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు 

ఎవరి ఇంట్లో అయినా.. దీపం లేకుండా వుండిన 

ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో..

అప్పుడు నల్లని చీర ధరించిన ఒకామే నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూంది.

అప్పుడు నువ్వామెని అడ్డగించి బయటకి వెళ్ళితే లోపలికి రాకూడదని షరతు విధించు.

అప్పుడామె నేను లోపల వుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది.

ఇంకొకామే పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది.

అమెని కూడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు.

అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను 

లోపలికి వెళ్ళిపోతానంటుంది .

ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని ''మునీశ్వరుడు చెప్పినది గుర్తుకువస్తుంది . 

వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోను దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది .

వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలోఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. 

మునీశ్వరుడు చెప్పినట్లుగా..చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని 

శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ వుంటుంది 

అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం ఎవరైతే..

సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రసాదిస్తుంది . 

ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో 

తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...