విద్యలో ఆటంకాలు-పరిహారం

 


విద్యలో ఆటంకాలు-పరిహారం

తల్లిదండ్రులందరూ తమ పిల్లలు మంచి  విద్యావంతులుఅవ్వాలని కోరుకుంటారు. ఉన్నత చదువులు చదివి గొప్ప స్థానంలో ఉండాలని అనుకుంటారు. ఎంత కష్టపడి చదివినప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలి అనగా జాతకంలోని గ్రహాలు సపోర్ట్ చేయాలి. కొంతమందికి విద్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం విద్యను రెండు భాగాలుగా విశ్లేషణ చేయవచ్చు చతుర్ధ భావం అనేది ప్రాథమిక సూచిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో డిగ్రీ లేదా బీటెక్ వచ్చేవరకు ప్రాథమిక విద్యగా పరిశీలించాలి. భాగ్య స్థానం హైయర్ ఎడ్యుకేషన్ సూచిస్తుంది. ప్రాథమిక విద్యను ద్వితీయ భావం కూడా పరిశీలించాలి. ద్వితీయభావంలో రాహువు ఉంటే విద్యలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇటువంటి జాతకులు సబ్జెక్టు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. చదువు విషయంలో అబద్ధాలు చెప్తారు అదే విధంగా జాతకంలో వక్ర గురువు ఉన్నప్పుడు చదువులో ఆటంకాలు మరియు Discontinue  అవకాశాలు ఉంటాయి. చతుర్ధ స్థానం అనేది చదువు ప్రారంభం నుండి డిగ్రీ వరకు చదువును సూచిస్తుంది. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుంటేనే హయ్యర్ స్టడీస్ కి వెళ్ళగలుగుతారు. చతుర్థాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు ఎంత కష్టపడి చదివినప్పటికీ ఫలితం చాలా తక్కువగా వస్తుంది. అదేవిధంగా చతుర్ధాధిపతి ఆరో స్థానంలో ఉన్నా లేదా మూడో స్థానంలో ఉన్నప్పటికీ కూడా చదువులో సమస్యలు ఎదుర్కొంటారు. శని భగవానుడు చతుర్దంలో ఉన్నప్పుడు కూడా చదువు లో చాలా సమస్యలు ఉంటాయి. కానీ చతుర్దంలో శని భగవానుడు ఉండి గురువు కానీ మరి ఇతర శుభగ్రహాలు దృష్టి ఉన్నప్పుడు చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ చదువు అయితే పూర్తి చేస్తారు. అదేవిధంగా చతుర్ధాధిపతితో 12వ అధిపతిగాని 6వ అధిపతి గాని కలిసినప్పుడు  విద్యలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ సూచించేది తొమ్మిదో భావం తొమ్మిదో భావం లో శని భగవానుడు ఉన్న లేదా తొమ్మిదో స్థానాధిపతి వక్రించిన, నీచ పొందిన హైయర్ ఎడ్యుకేషన్ తొందరగా పూర్తి చేయలేరు చాలా సమస్యలతో కూడుకుని ఉంటుంది. ఎంట్రస్ లో పాస్ అవ్వకపోవడం కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయితే తిరిగి మరల రాయడం జరుగుతూ ఉంటాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత అనగా డిగ్రీ లేదా బీటెక్  తర్వాత కొన్ని సంవత్సరాలపాటు ఆగి మరల హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తారు. ఏమైనప్పటికీ చతుర్థి స్థానం బాగుంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది ఒక్కొక్కసారి చతుర్ధ స్థానం అధిపతి అష్టమంలో ఉన్నప్పుడు విద్యలో చాలా ఆటంకాలు ఎదుర్కొంటారు కానీ ఇటువంటి జాతకులు మెడిసిన్ కానీ లేదా సముద్ర జలాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ లేదా భూమి అంతర్భాగంలో ఉండే అండర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైన్స్ ఇటువంటి వాటిలో బాగా రాణిస్తారు. విద్యలో సమస్యలు ఉన్నప్పుడు పరిహారాలన్నీ చెప్పడం ఈ ఆర్టికల్ లో సరిపోదు.విద్యలో ఏమైనా ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు జాతక చక్రాన్ని పరిశీలించుకుని దోషానికి తగిన పరిహారాన్ని చేసుకున్నప్పుడు సంతోషకరంగా విద్యను పూర్తి చేయగలుగుతారు. మీ పిల్లల విద్యలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అని భావిస్తే క్రింది నెంబర్ కు ఫోన్ చేయండి.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #studyproblems #kidsstudy #studentsproblems #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...