విదేశాలలో శాశ్వత నివాసం
విదేశాలలో శాశ్వత నివాసం
ప్రస్తుత కాలంలో విదేశాలకు వెళ్లాలని విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చాలా మంది కోరిక. విదేశాలలో అత్యధిక ధన సంపాదన విలాసవంతమైన జీవితం గడపాలని కోరిక ఉంటుంది. కొంతమంది విదేశాలలో కొద్ది సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి మరల మాతృదేశానికి వస్తూ ఉంటారు. మరి కొంతమంది విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి విజయం సాధించలేక మరల తమ దేశానికి వస్తారు. మరికొందరు విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ స్థిర నివాసం పొందుతారు. జాతక పరిశీలన చేసినప్పుడు పై మూడు విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మొదటిగా 4 8 12 స్థానాలు కారణం అవుతాయి. నాలుగవ స్థానం బలహీనపడి ఆ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు మాతృదేశానికి దూరంగా ఉంటారు. 8 రహస్య స్థానం, 12 సుఖస్థానం. నాలుగో స్థానం లో పాపగ్రహాలు ఉండి 8 12 స్థానాలకు సంబంధం ఏర్పడినప్పుడు జాతకుడు విదేశాలలో నివసిస్తాడు. 8 12 స్థానాలలో గ్రహాలు ఎక్కువ కాలం పాటు దశ జరిగితే శాశ్వతంగా విదేశాలలో ఉంటారు. లేదా ఆ దశ జరిగినంత కాలం విదేశాలలో ఉంటారు. 8 12 స్థానాలు బలహీనమై ఉన్నప్పుడు విదేశాలలో జాతకులు జైలు శిక్ష లేదా పనిష్మెంట్ లేదా శరణార్థులుగా కుటుంబానికి దూరంగా ఉంటారు. తొమ్మిదో స్థానం దూర ప్రయాణాలు ద్వారా సంపాదన తెలియజేస్తుంది. 4 8 12 స్థానాలతో పాటు తొమ్మిదవ స్థానం కూడా బలంగా ఉంటే విదేశాలకు వెళ్లి ఎక్కువ కాలం పాటు అనగా స్తిర నివాసం ఏర్పరచుకొని ధన సంపాదన ఉంటుంది. తొమ్మిదో స్థానం బలహీన అయినప్పుడు విదేశాలకు వెళతారు కొంత కాలం అక్కడ ఉండి ధన సంపాదన లేక తిరిగి మాతృదేశానికి వచ్చేస్తారు. 8 12 స్థానాలు అత్యంత ప్రమాదమైన స్థానాలు 8వ స్థానం ఆయుష్షు మరియు గండాలను సూచిస్తుంది. విదేశాలలో కొంతమంది దుర్మరణం చెందుతారు వీటికి 6 8 12 స్థానాలకు సంబంధం ఉంటుంది. రాహు కేతువులు కూడా విదేశాలకు వెళ్లడానికి సహకరిస్తారు ఎక్కువ గ్రహాలు రాహు కేతు నక్షత్రాలలో ఉంటే విదేశాలకు వెళతారు. జాతకంలో ఎక్కువ గ్రహాలు వక్రీస్తే విదేశాలకు వెళ్లాలని కోరిక చాలా ఎక్కువ ఉంటుంది వారు విదేశాలకు కచ్చితంగా వెళతారు. గురుడు కుజుడు శని భగవానుడు ఈ గ్రహాలు జాతకంలో ఆరు స్థానాలకు అధిపతులు వీరు వక్రిస్తే విదేశాలకు కచ్చితంగా జాతకులు వెళతారు. నాలుగో స్థానం బలహీనమైపోయి ఎనిమిది 12 స్థానాలు పూర్తి బలంగా ఉండి తొమ్మిదవ స్థానం కూడా బలపడితే జాతకుడు విదేశాలలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని స్థిరాస్తులు కూడా సంపాదిస్తారు. విదేశాలలో ఉద్యోగం కొరకు వెళదామనుకునేవారు మీ జాతకం పరిశీలించుకుని విదేశాలలో ఎటువంటి స్థానాన్ని పొందగలుగుతారు ముందుగా తెలుసుకుంటే దానికి తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవచ్చు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి