పంచాయతన పూజ ముఖ్యాంశాలు

పంచాయతన పూజ  ముఖ్యాంశాలు.

 పంచాయతనం అంటే ఐదుగురు దేవతామూర్తులతో కూడిన పీఠం.

పంచాయతన పూజ అనేది ఐదు ప్రధాన దేవతలను ఏకరూప పరబ్రహ్మ స్వరూపాలుగా భావించి చేసే ఆరాధన.

శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు మతసామరస్యాన్ని స్థాపిస్తూ ఈ పూజా విధానాన్ని ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు.

స్కాంద పురాణం ప్రకారం సూర్యుడు, అమ్మవారు, మహావిష్ణువు, గణపతి, పరమశివుడు భిన్నులు కాదని చెప్పబడింది.

ఈ పూజలో అగ్నికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

పంచాయతన దేవతలు

ఆదిత్యుడు (సూర్యుడు)

అంబిక (అమ్మవారు)

మహావిష్ణువు

గణనాథుడు (గణపతి)

మహేశ్వరుడు (శివుడు)

శ్లోకం

ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం ।

పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం ॥

పంచభూతాలు – దేవతల సంబంధం.

శివుడు – ఆకాశ తత్త్వం

అమ్మవారు – వాయు తత్త్వం

సూర్యుడు – అగ్ని తత్త్వం

విష్ణుమూర్తి – జల తత్త్వం

గణపతి – పృథ్వీ తత్త్వం

శివ పంచాయతనంలో దేవతల స్థానాలు.

మధ్యలో – శివుడు

ఈశాన్యం (ఉత్తర-తూర్పు) – విష్ణుమూర్తి

ఆగ్నేయం (దక్షిణ-తూర్పు) – సూర్యుడు

నైరుతి (దక్షిణ-పడమర) – గణపతి

వాయవ్యం (ఉత్తర-పడమర) – అంబిక

ముఖ్య నియమం.

ఏ దేవతను మధ్యలో ఉంచి పూజిస్తారో, ఆ పూజను ఆ దేవత పేరుతో పిలుస్తారు.

శివుడు మధ్యలో ఉంటే – శివ పంచాయతనం

విష్ణువు మధ్యలో ఉంటే – విష్ణు పంచాయతనం

అలాగే ఇతర దేవతలకు కూడా.

పంచాయతన పూజ లక్ష్యం

భగవంతుడు ఒక్కడే అన్న భావనను గ్రహించడం.

పంచభూతాత్మక శరీరాన్ని దైవస్వరూపంగా భావించడం.

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడం.

మతసామరస్యాన్ని పెంపొందించడం.

పంచాయతన శిలలు,

సూర్య శిల – తంజావూరు ప్రాంత నదిలో లభించే స్ఫటిక శిల

గణపతి శిల – శోణభద్రా నదిలో లభించే ఎర్రరంగు శిల

విష్ణు (సాలగ్రామం) – నేపాల్‌లోని గండకీ నదిలో లభిస్తుంది.

అంబికా శిల – కాళహస్తి స్వర్ణముఖి నదిలో లభిస్తుంది.

బాణలింగం (శివుడు) – నర్మదా నదిలోని ఓంకార కుండంలో లభిస్తుంది.

ప్రతి దేవత - ఆరాధన ఫలితాలు

సూర్యుడు

ఆరోగ్యం ప్రసాదిస్తాడు.

ఆయురారోగ్యాలు కలుగుతాయి.

శక్తి, తేజస్సు, ఓజస్సు పెరుగుతాయి.

అమ్మవారు.

వాక్‌శుద్ధి కలుగుతుంది.

సంపద, సుభాగ్యం లభిస్తాయి.

మానసిక పరిణతి, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.

దివ్యదృష్టి వంటి ఆధ్యాత్మిక శక్తులు లభిస్తాయి.

మహావిష్ణువు.

మోక్షప్రదాత.

ధర్మమార్గంలో నడిపిస్తాడు.

భగవద్గీత ద్వారా జీవన మార్గదర్శకత్వం అందిస్తాడు.

గణపతి.

విఘ్నాలను తొలగిస్తాడు.

కార్యసిద్ధి కలుగుతుంది.

యోగసాధనకు అనుకూలత కలుగుతుంది.

ఐహిక, పారమార్థిక కోరికలు నెరవేరుతాయి.

ఈశ్వరుడు.

ఆయుష్షు వృద్ధి కలుగుతుంది.

ఐశ్వర్యం ప్రసాదిస్తాడు.

దుఃఖ నివారణ కలుగుతుంది.

గ్రహబాధలు తొలగుతాయి.

అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.

కుటుంబ సంప్రదాయం ప్రకారం

వంశపారంపర్యంగా వచ్చిన ఇలవేల్పు దేవతను మధ్యలో ఉంచాలి.

మిగిలిన నాలుగు దేవతలను నాలుగు దిక్కులలో స్థాపించాలి.

ఉదాహరణకు,

ఇలవేల్పు విష్ణువు అయితే – విష్ణువు మధ్యలో.

ఇలవేల్పు శివుడు అయితే – శివుడు మధ్యలో.

"పంచాయతన పూజ ఫలితం"

పాపక్షయం.

సకల శుభప్రాప్తి.

ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, మోక్షసాధన.

అంతఃకరణ శుద్ధి.

భగవంతుని ఏకత్వ భావన స్థిరపడుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...