తీవ్ర ఆర్థిక సమస్యలు :- జ్యోతిష్య పరిహారాలు.

తీవ్ర ఆర్థిక సమస్యలు :- జ్యోతిష్య పరిహారాలు.

తీవ్ర ఆర్థిక సమస్యలు మనిషిని కృంగదీస్తాయి సమాజంలో ప్రతిష్ట మసకబారుతుంది. 

నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది సరియైన ఉద్యోగం లేక వ్యాపారాలలో తీవ్ర నష్టం వల్ల లేదా ఇతర మానవ తప్పిదాల వల్ల తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. 

మానవ జీవితంలో వచ్చే ఇటువంటి ఆర్థిక సమస్యలకు మన మహర్షులు ఎన్నో తరుణోపాయాలు సూచించారు. 

వీటిని మూఢనమ్మకాలుగా కొట్టివేయకుండా సంపూర్ణ విశ్వాసంతో ఆచరిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది.

జాతక పరిశీలన ద్వారా పరిహారాలు

జాతక పరిశీలన ద్వారా ఆర్థిక సమస్యలకు మూల కారణాలను గుర్తించవచ్చు.

 జాతకంలో ఏ గ్రహ సంయోగాల ద్వారా ఆర్థిక సమస్యలు వస్తున్నాయో పరిశీలించి ఆయా గ్రహాలకు శాంతి పరిహారాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. 

జాతకం కోసం పుట్టిన తేదీ, పుట్టిన సమయం పుట్టిన ఊరు వంటి వివరాలు తప్పనిసరి.అయితే ఈ వివరాలు లేనివారు కూడా ప్రయోజనం పొందడానికి మన మహర్షులు అన్ని రకాల ప్రజల కోసం కొన్ని సాధారణ పరిహారాలను సూచించారు.

జాతకం ఉన్నవారు, పుట్టిన తేదీ వివరాలు లేనివారు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు.

ఆర్థిక సమస్యలకు సాధారణ పరిహారాలు:-

ఈ క్రింద ఉదహరించిన పరిహారాలు ఎవరైనా పాటించవచ్చు. మీకు అనుకూలమైన వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరిహారాలను ఎంచుకొని పాటించవచ్చు. అన్నీ పాటించనవసరం లేదు.

మహాలక్ష్మి పూజ:- ప్రతి పౌర్ణమి తిథి రోజు మహాలక్ష్మి ఆలయంలో సహస్రనామార్చన చేయిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ఆంజనేయ స్వామి పూజ (మంగళవారం):- ప్రతి మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.

శ్రీ లలిత సహస్రనామావళి:- 41 రోజుల పాటు శ్రీ లలిత సహస్రనామావళి తో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.

ఆంజనేయ స్వామికి ఆకు పూజ: 21 రోజుల పాటు వరుసగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ జరిపించాలి.

హనుమాన్ చాలీసా పారాయణం: 41 రోజుల పాటు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా 11 సార్లు అన్ని నియమాలు పాటిస్తూ చదవాలి. రాత్రి పూట చదివితే ఫలితం బాగా వస్తుంది.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజ: 90 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి రోజు 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి. మరియు 

ప్రతి మంగళ వారం నాడు స్వామి వారికి అభిషేకం చేయడం వల్ల అనుకూలం.

రాహు-కేతు పూజ (శ్రీకాళహస్తి):- శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజను మంగళవారం రాహు కాలంలో చేయాలి. గురువారం నిద్ర చేసి

శుక్రవారం నాడు రాహు కాలంలో ఆలయం లోపల పూజ విశేషం.

దుర్గా ఆలయంలో రాహు కాల దీపం:- 18 మంగళవారాలు లేదా శుక్రవారము లందు దుర్గా ఆలయంలో రాహు కాల దీపం వెలిగించాలి.

గణపతి అర్చన: 41 రోజుల పాటు గణపతిని గరికతో అర్చించాలి.

శ్రీ వేంకటేశ్వర స్వామి పూజ:- 11 శ్రవణ నక్షత్రం రోజులందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు, పూలతో సహస్ర నామార్చన చేయించాలి.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజ:- 5 స్వాతి నక్షత్రం రోజులలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సహస్ర నామార్చన జరిపించాలి.

సహస్రనామావళి కుంకుమార్చన:- శ్రీ లక్ష్మీ సహస్రనామావళి లేదా శ్రీ లలిత సహస్ర నామావళితో 

ఒక సంవత్సరం పాటు కుంకుమార్చన చేయాలి. అన్ని నియమాలను పాటించాలి.

విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీసూక్తం: ప్రతిరోజూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీసూక్తం పారాయణం చేస్తే ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోగలవు.

గణపతి ఆలయంలో ప్రదక్షిణలు మరియు పారాయణం:- 

గణపతి ఆలయంలో 41 రోజుల పాటు ప్రతి రోజు 28 ప్రదక్షిణాలు చేసి గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి.

ఈ రోజులలో చవితి తిథి రోజున ఉపవాసం ఉండి, గణపతికి ఉండ్రాళ్ళు మరియు ఇతర మధుర ఫలాలను నివేదిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

సర్పసూక్తంతో అభిషేకం:- సర్పసూక్తంతో శివాలయంలో 21 రోజుల పాటు అభిషేకం చేయాలి.

శ్రీ గురుచరిత్ర పారాయణం:- 11 సప్తాహాలు శ్రీ గురుచరిత్రను అన్ని నియమాలతో పారాయణం చేసి, అనంతరం ఏదైనా దత్త క్షేత్రాలలో ముగించడం వల్ల సమస్యలు తీరిపోతాయి.

 బ్రాహ్మణులకు అన్నదానం:- 5, 11, 15, 21, 25 లేదా 27 సంఖ్యలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఎటువంటి ధన, ఉద్యోగ సమస్యలైన త్వరగా తీరిపోగలవు.

కుదరని పక్షం లో అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చిన అన్ని రకాల దోషాలు తొలగును.

మంత్ర జపం: గురుముఖంగా లక్ష్మి, లలిత, దత్త, విష్ణు, శివ మంత్రాలను తీసుకొని ప్రతిరోజూ క్రమం తప్పకుండా జపం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

సంధ్యావందనం:- అర్హత ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజూ సంధ్యావందనం ఆచరించాలి. సంధ్యావందనం చేయకుండా ఏ దేవతను ఆరాధించినా ప్రయోజనం ఉండదని, సంధ్యావందనం సకల అరిష్టాలను తొలగిస్తుందని ప్రతీతి.

చండీ సప్తశతి పారాయణం:- ప్రతిరోజూ చండీ సప్తశతి పారాయణం చేస్తే అన్ని సమస్యలు తీరిపోగలవు.

సుందరకాండ పారాయణం:- వాల్మీకి రామాయణంలోని సుందరకాండను ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్నీ శుభాలు కలుగుతాయి.

ఈ పరిహారాలను శ్రద్ధగా విశ్వాసంతో పాటించడం ద్వారా తీవ్ర ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు జీవితంలో సౌభాగ్యాన్ని పొందవచ్చు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...