ఇచ్ఛాశక్తి


 ఇచ్ఛాశక్తి

మానవ జీవితంలో విజయానికి పునాదులైన శక్తులలో ముఖ్యమైనవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవి పరాశక్తి ప్రధాన స్వరూపాలు. ఏ కార్యమైనా ముందుగా ఒక చిన్న కోరికగా మనసులో మొలకెత్తుతుంది. అది సంకల్పంగా మారి, తగిన జ్ఞానాన్ని సంపాదించి, చివరికి క్రియాశక్తి ద్వారా కార్యసిద్ధికి దారితీస్తుంది. ఇచ్ఛాశక్తి లేకుండా ఏ కార్యమూ మొదలు కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘‘ఉద్ధరేత్‌ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్‌ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః’’ అంటాడు. అంటే- మనిషి తన ఇచ్ఛాశక్తి ద్వారానే తనను తాను అభివృద్ధి చేసుకోవాలి. ఒకవేళ ఆ కోరిక బలహీనతకు కారణమైతే, అదే అతడి శత్రువుగా మారుతుంది. 

ఏ కార్యం చేపట్టినా ఆ దిశగా ప్రయాణంలో త్రిగుణాలు ఆటంకాలు కలిగించవచ్చు. అయితే ఆ పని మనకు ఇష్టమైనదైతే, ఎన్ని ఆటంకాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. అదే ఇష్టం లేని పనైతే, చిన్న ఇబ్బందులనే పెద్ద అడ్డంకులుగా భావించి ముందుకు వెళ్లం. కాబట్టి, చేపట్టే ప్రతి పనినీ కర్తవ్యంగా భావిస్తే అది ఇష్టంగా మారుతుంది. ఇష్టం పెరిగినప్పుడు ఇచ్ఛాశక్తి బలపడుతుంది. అప్పుడు కార్యసాఫల్యానికి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించే తపన కలుగుతుంది. ఆ జ్ఞానం క్రియాశక్తిగా మారి విజయాన్ని అందిస్తుంది. ఈ త్రివేణి సంగమం- కార్యసిద్ధికి మూలాధారం. హనుమంతుడికి సీతాన్వేషణ బాధ్యత అప్పగించినప్పుడు, మొదట ఆయనలో ఇచ్ఛాశక్తి ఉద్భవించింది. ‘నేను ఈ కార్యాన్ని సాధిస్తాను’ అనే సంకల్పం కలిగింది. అది జ్ఞానాన్ని మేల్కొలిపింది. దాంతో తన శక్తులను గుర్తుచేసుకున్నాడు. ఆ రెండూ కలిసి క్రియాశక్తిగా మారడంతో సముద్రాన్ని దాటి, లంకలోకి ప్రవేశించి, సీతామాతను కనుగొన్నాడు. ఈ విధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కలయిక హనుమంతుడికి విజయాన్ని అందించింది. 

పార్వతీదేవి శివుణ్ని వరుడిగా పొందాలనే దృఢమైన కోరికతో తపస్సు చేసింది. ఆ సంకల్పశక్తి, భక్తి, సహనం కలిసి చివరికి ఆమెను అర్ధనారీశ్వర రూపంలో శివుడితో ఏకమయ్యే స్థాయికి చేర్చాయి. ఇది ఇచ్ఛాశక్తి పరాకాష్ఠకు ఉదాహరణ. అయితే ఇచ్ఛాశక్తి ఉన్నప్పటికీ, అందరూ విజయాన్ని సాధించలేరు. ఎందుకంటే మనసు విషయవాంఛలకు లోనై, ఏకాగ్రత కోల్పోతుంది. అరిషడ్వర్గాల ప్రభావంతో లక్ష్యం దూరమవుతుంది. భర్తృహరి సుభాషితాలలో ఈ విషయాన్ని చక్కగా చెప్పారు- విఘ్నాల భయంతో పని మొదలు పెట్టనివారు అధములు. పని మొదలుపెట్టి, ఆటంకాలు ఎదురైతే మధ్యలో వదిలేసేవారు మధ్యములు. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగేవారు ఉత్తములు. అలాంటి ఉత్తములుగా మారాలంటే, ఇచ్ఛాశక్తి బలంగా ఉండాలి. దానికి సంకల్పశుద్ధి తోడైతే, దైవానుగ్రహం లభిస్తుంది. దైవానుగ్రహం వల్ల జ్ఞానశక్తి, క్రియాశక్తి సమకూరుతాయి. అప్పుడు కార్యసిద్ధి అనివార్యమవుతుంది. అంటే- ఇచ్ఛాశక్తి విజయానికి తొలి అడుగు. దానికి జ్ఞానం దారి చూపుతుంది. క్రియాశక్తి గమ్యానికి చేర్చుతుంది. ఈ మూడు కలిసినప్పుడే జీవితం సార్థకమవుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...