తదియ - స్వర్ణగౌరీ వ్రతం


 తదియ - స్వర్ణగౌరీ వ్రతం

ఈశ్వరుడు చెప్తున్నాడు-

బ్రహ్మపుత్రా! శ్రావణశుక్లపక్షంలో తదియనాడు శుభప్రదమైన స్వర్ణగౌరీవ్రతాన్ని ఆచరించాలి. ప్రాతఃకాలంలో స్నానం చేసి, నిత్యకర్మలను ఆచరించి వ్రతం చెయ్యడానికి సంకల్పం చెప్పుకోవాలి. పిమ్మట పార్వతీశంకరులను షోడశోపచారాలతో పూజించాలి. పూజ అనంతరం భవానీదేవి ప్రీతి కొరకు వరినూక, అన్నములతో చేసిన పదహారు రకాల వంటకాలను పదహారు కంచుపాత్రలలో పెట్టి దంపతులకు -

దేవ దేవ సమాగచ్ఛ ప్రార్థయేఽహం జగత్పతే, ఇమాం మయా కృతాం పూజాం గృహాణ సురసత్తమ. 

వాయనాని ప్రదేయాని దమృతీభ్యస్తు షోడశ, భవాన్యాశ్చ మహాదేవ్యా వ్రతసమ్పూర్ణహేతవే...

అని ప్రార్థించి వాయనం ఇవ్వాలి.

తరువాత “ప్రీతయే ద్విజవర్యాయ వాయనం ప్రదదామ్యహం” అని ప్రార్థించి బ్రాహ్మణునకు వాయనం ఇవ్వాలి.

అటుపిమ్మట అలంకృతులైన పదహారుమంది దంపతులకు లేదా సువాసినులకు వస్త్రాది భూషణాలను సమర్పిస్తూ ఇలా ప్రార్థించాలి-

కుర్యాద్వస్త్రాదిభిర్యుక్తాన్యాహూయ ద్విజదమ్పతీన్, 

వ్రత సంపూర్ణతార్థం తు బ్రాహ్మణేభ్యో దదామ్యహం. 

స్వలంకృతాః సువాసిన్యః పాతివ్రత్యేన భూషితాః, 

మమ కార్యసమృద్ద్యర్థం ప్రతిగృహంతు శోభనాః.

ఈ విధంగా పదహారు సంవత్సరాలు లేదా అరవైనాలుగు తదియలు లేదా ఒక సంవత్సర కాలం వ్రతాన్ని ఆచరించి ఉద్యాపనం చేసుకోవాలి.

పూజ అయ్యాక ఈ వ్రతానికి సంబంధించిన కథ విని కథ చెప్పిన వ్యక్తిని దక్షిణాదులతో గౌరవించాలి.

సనత్కుమారుడు అడుగుతున్నాడు- "హే ప్రభూ! ఈ వ్రతాన్ని ఎవరు, ఏ విధంగా ఆచరించారు? దీని మాహాత్మ్యం, ఉద్యాపన విధానం మొదలైనవి తెలియజేయండి".

ఈశ్వరుడు చెప్తున్నాడు-

ఈ స్వర్ణగౌరీవ్రతం సర్వసంపదలను చేకూర్చేది. పూర్వకాలంలో సరస్వతీ నదీతీరంలో సువిలా అనే నగరంలో కుబేరునితో సమానుడైన చంద్రప్రభుడను పేరుగల రాజు ఉండేవాడు. మహాదేవి, విశాల అనే ఇద్దరు సౌదర్యవంతులైన భార్యలలో పెద్దదైన మహాదేవి అంటే ఆ రాజుకు ఇష్టం ఎక్కువగా ఉండేది.

వేటాడడం యందు అభిరుచి కలిగిన రాజు ఒకసారి వేటకు వెళ్ళి సింహ శార్దూల-వరాహ మొదలైన జంతువులను వేటాడి దాహము కలవాడై, ఆ అడవిలో మరింత లోపలకు ప్రవేశించి చక్రవాకపక్షులు, చిలుకలు మొదలైన పక్షులతో, వికసించిన మల్లెలు మొదలైన సువాసనులు వెదజల్లే సుందర ప్రాంతంలో అప్సరసలకు సంబంధించిన కమలాలతో శోభిల్లే సరస్సును సమీపించి ఆ స్వచ్ఛజలాలను త్రాగి, ఆ తీరంలో భక్తిగా స్వర్ణగౌరీవ్రతాన్ని ఆచరిస్తున్న అప్సరసలను చూసి ఆ వ్రత వివరాలను అడిగితే వారు రాజుతో చెప్పడం ప్రారంభించారు-

“ఓ రాజా! ఈ వ్రతం శ్రావణ శుక్లపక్ష తదియ నాడు ఆచరించాలి. ఇది పార్వతీశంకరులను పూజించే స్వర్ణగౌరీవ్రతం. పదహారు ముడులతోనున్న తోరాన్ని పురుషులు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి లేదా మెడలో ధరించాలి” అని చెప్పగా విని రాజు అక్కడికక్కడే ఆ వ్రతాన్ని ఆచరించి, “గుణైః షోడశభిర్యుక్తం దోరకం దక్షిణే కరే, బధ్నామి దేవదేవేశి ప్రసాదం కురు మే వరం" అని ప్రార్థించి తన రాజ్యాన్ని చేరుకున్నాడు.

రాజు చేతికి కట్టుకున్న ఆ తోరాన్ని చూసిన పెద్దభార్య ఆ తోరం ఎలా వచ్చిందని కోపంగా ప్రశ్నిస్తూనే, రాజు వారిస్తున్నా వినకుండా తోరాన్ని త్రెంచి అక్కడ ఎండిపోయి ఉన్న ఒక చెట్టుపైకి విసరివేసింది. ఆ తోర ప్రభావంతో చెట్టు వెంటనే చిగురించడం మొదలుపెట్టింది. ఇదంతా గమనించిన విశాల అనే రెండవ భార్య ఆ తోరాన్ని తీసి భక్తిగా తన ఎడమచేతికి ధరించింది. ఆ నాటి నుండి ఆ తోర ప్రభావం వల్ల రాజుకు విశాలపై అత్యంత ప్రేమ కలిగి, పెద్ద భార్యను దూరంగా పెట్టాడు. దానికి బాధపడిన మహాదేవి అడవులలో తిరుగుతూ, ఆమె చేసిన పనికి ఎందరో తపోధనుల దూషణలను పొందుతూ, అత్యంత బాధతో ఒక చోట కూలబడిపోగా, అమ్మవారికి దయ కలిగి ఆమెకు ప్రత్యక్షం అయింది. అప్పుడు ఆ రాజు భార్య అనేకవిధాలుగా నమస్కారాలు పెడుతూ

"జయ దేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే,

జయ శంకరవామాంగే జయ మంగళమంగళే" వివిధ విధాలుగా ప్రార్థించింది.

దానికి ప్రసన్నురాలైన గౌరీదేవి స్వర్ణగౌరీవ్రతాన్ని ఆమె చేత ఆచరింపజేయగా, దాని ఫలంగా దేవీ అనుగ్రహంతో రాజు ఆమెను వెతుక్కుంటూ అరణ్యానికి వచ్చి రాజ్యానికి తీసుకు వెళ్ళి, ఇద్దరు భార్యలను అత్యంత అనురాగంతో చూసుకుంటూ రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ, సుఖసంతోషాలతో తులతూగి, మరణానంతరం భార్యలతో పాటుగా శివపదాన్ని పొందాడు.

“ఓ సనత్కుమారా! ఈ వ్రతం నాకు, గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ వ్రతాన్ని ఆచరించినవారెవరైనా ఈ లోకంలో శత్రుంజయులై, సమస్త సంపదలు పొంది, విశుద్ధమైన నా లోకాన్ని చేరుకుంటారు. ఇప్పుడు ఈ వ్రత ఉద్యాపన విధిని చెప్తున్నాను సావధానుడవై విన” మని శంకరుడు కొనసాగిస్తున్నాడు.

ఉద్యాపనకర్త తారాచంద్రబలాలు తనకు అనుకూలంగానున్న తిథి-వారమునందు ఒక మండపాన్ని ఏర్పరచి దాని మధ్యలో అష్టదళపద్మాన్ని లిఖించి, దానిపై ధాన్యాన్ని పోసి, దానిపై కలశస్థాపన చెయ్యాలి. దాని పైన మరల పదహారు మణుగుల(ఒక మణుగు=25 పౌండ్లు) రాగితో చేసిన పూర్ణపాత్రను నువ్వులతో నింపినది ఏర్పరచి, దానిపై పార్వతీశంకరుల ప్రతిమను ఉంచాలి. శివుని ప్రతిమకి తెల్లని రంగులోనుండే వస్త్రద్వయం, తెల్లని యజ్ఞోపవీతం ధరింపజేయాలి. విధిపూర్వకంగా స్థాపించి, ఆవాహన మొదలుకొని షోడశోపచారాలను వేదోక్తమంత్రాలతో ఆచరించి ఆ రాత్రి జాగరణతో గడపాలి.

మరుసటిరోజున ప్రాతఃకాల పూజ చేసి హోమం ఆచరించాలి. మొదటిగా గ్రహ హోమం చేసి, ప్రధాన హోమం చెయ్యాలి. యవలతో కలిపిన నువ్వులను నేతితో పూర్తిగా కలిపి వాటితో వెయ్యి లేదా వంద ఆహుతులతో హోమాన్ని చెయ్యాలి. పిమ్మట వస్త్రభూషణాదులు, గోదానం మొదలైనవాటితో ఆచార్యుని గౌరవించాలి. బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి, పదహారుమంది దంపతులకు కూడా భోజనాదులు పెట్టి, శక్తిమేరకు దక్షిణను సమర్పించి, చివరికి ఆనందోత్సాహాలతో బంధువులతో కూడి కర్త భోజనం చెయ్యాలి.

శ్రీ స్కాందపురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమునందు పన్నెండవ అధ్యాయము సమాప్తము

తరువాయి భాగంలో 

పదమూడవ అధ్యాయము

సశేషం

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...