ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు
ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం న భ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితాభి యోగాః
అర్థము:--ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు, చంద్రుడు కలువలను నవ్వించు చున్నాడు, అడుగకయే మేఘుడు వర్ష ధారలు గురిపించి జీవన దాన మొనర్చు చున్నాడు: సత్పురుషులు తమంత తామే పరహితమును చేయుటకు పరమోత్సాహము కలిగి యుందురు కదా!
పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్ నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్
తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే…
భావము:--ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి.
పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు.
అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు.
నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
విప్రాణాం జ్ఞానతో జైష్ట్యం
క్షత్రియాణాం తు వీర్య:
వైశ్యానాం ధాన్య ధనదః
శూద్రాణా మేవ జన్మతః
బ్రాహ్మణులలో పెద్దరికం వారి జ్ఞానము వల్లనే నిర్ణయించ బడుతుంది.క్షత్రియులలో బలము, శౌర్యము చేతనే పెద్దరికం నిర్ణయించ బడుతుంది. వైశ్యు లలో ధనము, ధాన్యములతోనే తోనే పెద్దరికం నిర్ణయించ బడుతుంది. శూద్రులలో మాత్రమే వయస్సు చేత నే పెద్దరికం నిర్ణయించ బడుతుంది.
ఆయుర్విత్తం గృహ చ్ఛిద్రం
మంత్రమౌషధ సంగమౌ
దానమానావమానశ్చ
నవ గోప్యా మనీషిభిః:
ఆయువు,అంటే వయస్సుచెప్పకూడదు. అని ఒక అర్థం. జ్యోతిష్యం ప్రకారం అయ్యుష్హు ఎంతో తెలిసినా చెప్పకూడదు. యింటిలోని కలతలు, బయటి వారికి చెప్పకూడదు. మీరు చేసిన దానము కూడా నేనింత చేశానని చెప్పుకోకూడదు. మనకు జరిగిన అవమానమును కూడా ఎవరికీ చెప్పకూడదు. సంగమము గురించి కూడా చెప్పకూడదు.
మంత్రమును, ఔషధము ఎలాగ తయారు చేసినదీ కూడా గోప్యముగానే వుంచుకొన వలయును. ఈ తొమ్మిదింటినీ గోప్యముగా వుంచవలయునని కవి యొక్క భావము
సేకరణ:
పెద్దమారు శ్రీనివాస్ రెడ్డి. క్యాతూరు
(వందే సంస్కృత మాతరం
కృష్ణం వందే జగద్గురుమ్...
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి