సంతానలేమి-జాతక విశ్లేషణ




 సంతానలేమి-జాతక విశ్లేషణ

ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య సంతానం ఆలస్యంగా కలగడం లేదా సంతానం లేకపోవడం. సంతానం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం అనేక రకాల మెడిసిన్స్ వాడడం చాలామందికి తప్పనిసరి అవుతుంది. కొంతమంది దంపతులు జ్యోతిష్యులను సంప్రదిస్తారు. జ్యోతిషంలో సంతానం కలగకపోవడానికి సంతానం ఆలస్యంగా కలగడానికి జాతకాన్ని పరిశీలిస్తే స్పష్టమైన కారణాలు తెలుస్తాయి. సంతానం ఆలస్యంగా కలుగుతుంది అని జాతకరీత్యా తెలిసినప్పుడు కొద్ది సమయం ఎదురు చూడాలి తర్వాత సంతానం సులభంగా కలుగుతుంది. సంతానాన్ని జాతకరీత్యా పరిశీలించాలంటే పంచమ భావాన్ని పరిశీలించాలి. పంచమ స్థానాధిపతి లేదా పంచమ స్థానంలో ఉండే గ్రహాలు ఆధారంగా సంతాన విషయం తెలుస్తుంది. పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు గాని లేదా పంచమాధిపతి శని భగవానుడు అయినప్పుడు కానీ సంతానం ఆలస్యం అవుతుంది. పంచమాధిపతి వక్రించినప్పుడు ఫలితాలు వేరేగా ఉంటాయి. పంచమ స్థానంలో రాహు లేదా కేతువుఉన్నప్పుడు సంతాన సమస్యలు తీవ్రంగా ఉంటాయి కేతు అయితే కొంతవరకు పరవాలేదు కానీ పంచమ స్థానంలో రాహువు ఉన్నప్పుడు స్త్రీలకు గర్భాశయ సమస్యలు మరియు హార్మోను ఇన్ బ్యాలెన్స్  సమస్యలుఎక్కువగా ఉంటాయి. గర్భాశయ గోడలు మందంగా ఉండడం కూడా పంచమస్థానంలో రాహు ఉండడమే. పంచమంలో రాహు ఉన్నప్పుడు ఎక్కువగా అబార్షన్లు జరుగుతాయి. రాహువు పై గురు దృష్టి ఉన్నప్పుడు ఫ్రీ మెచ్యూర్డ్ బేబీ జన్మిస్తూ ఉంటారు. అంటే గురువు కారణంగా బేబీ తయారు అవుతుంది కానీ రాహు బేబీ ని డిస్టర్బ్ చేస్తాడు. ఈ కారణంగా సరియైన సంతానం కలగదు. పంచమ స్థానము మరియు రాహువు యొక్క స్థితిని నవాంశ లో కూడా పరిశీలిస్తే సంతాన విషయంలో లోపాలు తెలుస్తాయి. 9494550355సంతానానికి కారకుడు శుక్ర భగవానుడు యొక్క స్థితిని కూడా పరిశీలించాలి. బుధుడు నపుంసక గ్రహము సంతాన విషయంలో బుధుడిని కూడా పరిశీలించాలి. ఇంకా పూర్తిగా పరిశీలించాలంటే D5 చార్ట్ పరిశీలిస్తే సంతానం ఎందుకు ఆలస్యం అవుతుంది స్పష్టంగా తెలుస్తుంది. సంతానం ఆలస్యం అవుతున్నప్పుడు చిన్న చిన్న పరిహారాలతో కూడా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది కాళహస్తిలో పూజలు చేయించడం, గుంటూరు జిల్లా పెదకాకానిలో రాహు కేతు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇవి కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తాయి. జాతక చక్రం పూర్తిగా పరిశీలించి దానికి తగిన చిన్నచిన్న పరిహారాలు పాటించినప్పుడు సంతానం అతి త్వరలో కలుగుతుంది. సంతానం కోసం వైద్య సలహా తీసుకోవాలనుకునే వారు ముందుగా జాతక చక్రం పరిశీలించుకుని పరిహారాలు పాటించి తర్వాత వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.

జాతక,ముహూర్త,వివాహ విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును. 

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...